YS Jagan: ప్రతి ఇంట్లో ఉండే సమస్యలే: షర్మిలతో ఆస్తుల వివాదంపై జగన్

YS Jagan: పాలన వదిలేసి డైవర్షన్ కోసం తన తల్లి, చెల్లి గురించి ప్రచారం చేస్తారా అని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రశ్నించారు. తమ కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేస్తారా? అని అడిగారు

Update: 2024-10-24 07:54 GMT

YS Jagan: ప్రతి ఇంట్లో ఉండే సమస్యలే: షర్మిలతో ఆస్తుల వివాదంపై జగన్

YS Jagan: పాలన వదిలేసి డైవర్షన్ కోసం తన తల్లి, చెల్లి గురించి ప్రచారం చేస్తారా అని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్.. చంద్రబాబును ప్రశ్నించారు. తమ కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేస్తారా? అని అడిగారు.

ఇవన్నీ అన్ని ఇళ్లలో ఉండే సమస్యలే అని జగన్ చెప్పారు. మీ ఇళ్లలో ఇలాంటి కుటుంబ గొడవలు ఏమీ లేవా.. ఇవన్నీ ప్రతి ఇంటి కథలేనని ఆయన తెలిపారు. మీ స్వార్థం కోసం పెద్దవి చేసి చూపడం, నిజాలు లేకపోయినా..వక్రీకరించి చూపించడం మానుకోవాలని ఆయన చంద్రబాబుకు సూచించారు.కుటుంబ ఆస్తుల విషయమై జగన్ గురువారం స్పందించారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్ సీ టీఎల్ లో జగన్ పిటిషన్

సరస్వతి పవర్ కంపెనీలో తనకు, తన భార్య భారతిరెడ్డికి ఉన్న వాటాలను సరస్వితిలోనే తమకు చెందిన క్లాసిక్ రియాల్టీ అనే మరో కంపెనీకి ఉన్న వాటాల్లో అధిక భాగాన్ని తల్లి విజయమ్మ పేరుతో సర్వసతి కంపెనీ బోర్డు అక్రమంగా బదలాయించిందని భారతి,క్లాసిక్ రియాల్టీలతో కలిపి జగన్ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ ఎన్ సీ ఎల్ టీ లో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ కేసుకు సంబంధించిన వివాదాలు పరిష్కారమయ్యాక కొన్ని ఆస్తులను షర్మిలకు బదలాయించాలని గతంలో నిర్ణయించినట్టు జగన్ ఆ పిటిషన్ లో చెప్పారు.

ఈ పిటిషన్ కు ముందే జగన్ వైఎస్ షర్మిలకు లేఖ రాసినట్టుగా చెబుతున్నారు. ఈ లేఖలో తనను అప్రతిష్టపాల్జేసేలా వ్యవహరించారని జగన్ షర్మిలనుద్దేశించి వ్యాఖ్యలు చేశారని సమాచారం. అయితే ఈ లేఖకు షర్మిల కూడా కౌంటర్ ఇచ్చారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. వైఎస్ జగన్ రాసిన లేఖలోని అంశాల్లో వాస్తవం లేదని...వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇచ్చిన మాటను జగన్ తప్పారని తన లేఖలో ఆమె ప్రస్తావించారని సమాచారం.

Tags:    

Similar News