దోచుకున్న సొమ్ము దాచుకునేందుకే ఇస్తాంబుల్‌ వెళ్లారు?.. జగన్‌పై యనమల ఫైర్..!

Yanamala Rama Krishundu: దావోస్ లో పెట్టుబడిదారులతో మీటింగ్ అని చెప్పి సీఎం జగన్ అక్కడ ఏం చేస్తున్నారో తెలియడం లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు...

Update: 2022-05-24 10:44 GMT
Yanamala Questions Motive Behind Jagan Istanbul visit

దోచుకున్న సొమ్ము దాచుకునేందుకే ఇస్తాంబుల్‌ వెళ్లారు?.. జగన్‌పై యనమల ఫైర్..!

  • whatsapp icon

Yanamala Rama Krishundu: దావోస్ లో పెట్టుబడిదారులతో మీటింగ్ అని చెప్పి సీఎం జగన్ అక్కడ ఏం చేస్తున్నారో తెలియడం లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. దావోస్‌కు వెళుతున్నానని చెప్పి మధ్యలో లండన్, ఇస్తాంబుల్ ఎందుకు వెళ్లారో సీఎం చెప్పాలన్నారు.

స్విజర్లాండ్ తరువాత నల్లధనం దాచుకునే ప్రాంతం ఇస్తాంబుల్ అని, ఇక్కడ దోచుకున్న సొమ్ము ఇస్తాంబుల్లో దాచుకునేందుకు వెళ్లారా అని ప్రశ్నించారు. అనుమతులు లేకుండా లండన్, ఇస్తాంబుల్ వెళ్లడం వెనుక మతలబు ఏమిటో చెప్పాలన్నారు. ఇడుపులపాయలో జగన్ కు బంకర్లు ఉన్నాయని, ఆ బంకర్లలో దాచిన డబ్బులు వెలికి తీసి ఇప్పుడు లండన్, ఇస్తాంబుల్లో దాచుకునేందుకు వెళ్లినట్టు అనుమానాలు ఉన్నాయన్నారు.

Tags:    

Similar News