Heavy Rain Alert: ఐఎండీ అంచనాలు తారుమారు..తీరం దాటిన వాయుగుండం..తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Heavy Rain Alert:ఐఎండీ అంచనాలు తారుమారుఅయ్యాయి. ఎక్కడో తీరం దాటుతుందని అనుకుంటే..వాతావరణ శాఖ అంచనాలకు భిన్నంగా వాయుగుండ మరో ప్రాంతంలో తీరం దాటింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
Heavy Rain Alert: ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. వాయుగుండం తీరం దాటడంతో క్రమంగా బలహీనపడుతుంది. అయితే అది విశాఖపట్నానికి దగ్గరలోని ఖళింగపట్నంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దానికి భిన్నంగా ఆ వాయుగుండం అనకాపల్లిలోని సర్వసిద్ధి రాయవరం దగ్గర తీరం దాటింది. దాని ప్రభావం ఇప్పుడు ఏపీపై కనిపిస్తుంది.
ప్రస్తుతం ఏపీలో గుంటూరు నుంచి ఉత్తరాంధ్ర వరకు అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. నేడు ఏపీకి భారీ వర్ష ప్రభావం కాస్త తగ్గినట్లు . ఇప్పుడే వాయుగుండం తీరం దాటడంతో క్రమంగా ఉత్తరాంధ్ర నుంచి ఛత్తీస్ ఘడ్, ఉత్తర తెలంగాణ వైపు వెళ్తుంది. అప్పటికే వాయుగుండం బలహీనపడుతుంది. అందుల్ల నేడు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు రాత్రి 8 వరకు కురిసే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 2తర్వాత విశాకలో భారీ వర్షం పడే అవకాశం ఉంటుంది. రాయలసీమలో మాత్రం వర్షాలు పడే అవకాశం లేదు. రోజంతా మేఘాలు కమ్ముకుని ఉంటాయి.
ఇక ఇటు తెలంగాణ భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా మధ్య తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తోంది. తెలంగాణలో పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది. రోజంతా వర్షం కురుస్తుంది. రాత్రి 8 తర్వాత తూర్పు తెలంగాణలో వర్షం తగ్గుతుంది. రాత్రి 10గంటల తర్వాత హైదరాబాద్ లో కూడా వర్షం తగ్గుతుంది. ఆ తర్వాత సోమవారం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు వర్షం ఎక్కడా ఉండదు. అయితే వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము.