Taneti Vanitha: A1 ముద్దాయిగా చంద్రబాబుపై కేసు నమోదు చేస్తాం
Taneti Vanitha: పుంగనూరులో చంద్రబాబు రెచ్చగొట్టేలా మాట్లాడారు
Taneti Vanitha: పుంగనూరులో చంద్రబాబు రెచ్చగొట్టేలా మాట్లాడారని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. A1 ముద్దాయిగా చంద్రబాబుపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించాలనే కుట్ర అని పేర్కొన్నారు. దాడిలో 50 మంది పోలీసులకు గాయాలయ్యాయని...13 మందికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. 40 మందిని అదుపులోకి తీసుకున్నామని... నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వనిత స్పష్టం చేశారు.