Ambati Rambabu: కృష్ణా జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం
Ambati Rambabu: ఏపీకి రావాల్సిన ప్రతి నీటిబొట్టును తీసుకుంటాం
Ambati Rambabu: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జిలాల పంపిణీ విషయంలో..బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కొత్తగా విధి విధానాలు ఇవ్వడం కరెక్టు కాదన్నారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఇది అన్యాయం, అక్రమం, చట్ట వ్యతిరేకం అన్న ఆయన..దీనిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తామన్నారు. దీనిపై ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పెద్దలకు వివరించారన్న జగన్.. కృష్ణా జిల్లాలపై ఉన్న అడ్డంకులను తొలగించాలని కేంద్రాన్ని కోరారని తెలిపారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కొత్తగా విధి విధానాలు ఇస్తూ, గెజిట్ రిలీజ్ అయ్యింది కాబట్టి... దీనిపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.