Vijayawada: ఇంకా వరద ముంపులోనే విజయవాడ.. పలుచోట్ల సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం

Vijayawada Floods: విజయవాడను వరద ముంపు ఇప్పుడే విడిచిపెట్టేలా లేదు. బుడమేరు, కృష్ణా వరద ముంచెత్తడంతో బందర్ రోడ్ మినహా విజయవాడ మొత్తం జలదిగ్బంధంలోనే ఉంది.

Update: 2024-09-03 06:10 GMT

Vijayawada: ఇంకా వరద ముంపులోనే విజయవాడ.. పలుచోట్ల సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం

Vijayawada Floods: విజయవాడను వరద ముంపు ఇప్పుడే విడిచిపెట్టేలా లేదు. బుడమేరు, కృష్ణా వరద ముంచెత్తడంతో బందర్ రోడ్ మినహా విజయవాడ మొత్తం జలదిగ్బంధంలోనే ఉంది. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి.

అయితే పలు చోట్ల సహాయ చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలో వరదల కారణంగా ఇప్పటివరకు 19 మంది మృతి చెందినట్లు అంచనా వేశారు. ఒక్క విజయవాడలోనే 11 మంది మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా పునరావాస కేంద్రాల్లో 41 వేల 927 మంది బాధితులు ఆశ్రయం పొందుతున్నారు. సహాయక సిబ్బంది వెళ్లలేని వరద ప్రాంతాలకు హెలికాప్టర్లు, డ్రోన్లతో వరద బాధితులకు ఆహారం సరఫరా చేస్తున్నారు.

Tags:    

Similar News