నేటి నుంచి భక్తులకు దుర్గమ్మ దర్శనం

Update: 2020-06-10 03:50 GMT

సుమారు 80 రోజుల తరువాత భక్తులు కనక దుర్గమ్మ వారిని దర్శించుకోనున్నారు. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో భక్తుల దర్శనానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

నేటి నుంచి సామాన్యులకు అందుబాటులోకి దుర్గమ్మ దర్శనం. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దర్శనం. అమ్మవారి దర్శనం కోసం ఆన్లైన్ లో మాత్రమే టికెట్స్ బుక్ చేసుకోవాలి. టైమ్ స్లాట్ ప్రకారం అమ్మవారి దర్శనము. గంటకి 250 మంది అమ్మవారి దర్శనానికి అనుమతి. అమ్మవారి దర్శనంకి వచ్చిన భక్తులకు ముఖ దర్శనం మాత్రమే అనుమతి. తీర్థం, శఠగోపురం నిషేధం. అమ్మవారి దర్శనముకి వచ్చే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డ్, మాస్క్ ఉండాలి. 10 సంవత్సరాలు లోపు, 65 సంవత్సరాలు నిండిన, గర్భిణులు దర్శనంకి రాకపోవటం మంచిది. లిఫ్ట్ సౌకర్యం లేదు..క్యూ లైన్ లో నుంచి మాత్రమే అనుమతి. అన్నదానం లో పులిహోర, దద్దోజనం ప్యాకింగ్ చేసి పంపిణీ. కేశఖండన శాలలో గంటకి 3గురుకి అనుమతి, కేశఖండనకు ఆన్లైన్ లోనే టికెట్స్ బుకింగ్ తప్పనిసరి.

Tags:    

Similar News