Tiruamala: ఈనెలలో తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేశారా? అయితే ఈ 5 తేదీలను గుర్తుంచుకోండి ..ఎందుకో తెలుసా
TTD News: సెప్టెంబర్ నెల వచ్చేసింది. మీరు ఈ నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఆ తర్వాతే ప్లాన్ చేసుకోండి. ఎందుకో..ఏమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.
Tiruamala News: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్లాన్ చేసుకున్న భక్తులకు ముఖ్య గమనిక. ఈనెలలో అంటే సెప్టెంబర్ లో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటే కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సెప్టెంబర్ లో విశేష పర్వదినాలు ఏవో తెలుసుకోవాలి. ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల తిరుమలలో ప్రత్యేక పూజలు, దర్శనాలు ఉన్నాయో లేదో తెలుసుకునే అవకాశం ఉంటుంది. వీటిని అనుగుణంగా మీరు దర్శన ప్రయాణాన్నిప్లాన్ చేసుకోవచ్చు.
సెప్టెంబర్ నెలలో వచ్చే ప్రత్యేక పర్వదినాలు ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. కలియుగ వైకుంఠమైన తిరుమలలో సెప్టెంబర్ నెలలో విశేష పర్వదినాలు ఉన్నాయి. సెప్టెంబర్ 5వ తేదీ బలరామ జయంతి, వరాహ జయంతి ఉంది. సెప్టెంబర్ 7న వినాయకచవితి. ఈ రోజు చాలా మందికి గుర్తు ఉంటుంది.
ఇక సెప్టెంబర్ 17న అనంత పద్మనాభస్వామి వ్రతం ఉంటుంది. సెప్టెంబర్ 18న పౌర్ణమి శ్రీవారి గరుడసేవ జరుగుతుంది. ఈ రోజు తిరుమల కొండకు పెద్దఎత్తున భక్తులు వస్తుంటారు. రద్దీ ఎక్కువగా ఉంటుంది. సెప్టెంబర్ 28న సర్వ ఏకాదశి ఉంది. భక్తులు ఏకాదశి రోజు కూడా చాలా ఎక్కువ మంది కొండకు వస్తుంటారు. దీని వల్ల మీరు ఈ తేదీల్లో కొండకు వెళ్లాలని ప్లాన్ చేస్తే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.
మరోవైపు కొత్త హంగులతో తీర్చదిద్దబడిన స్వామి పుష్కరిణిలోని ఆదివారం నుంచి శ్రీవారి భక్తులను టీటీడీ అనుమతించనుంది. ఈ మరమత్తు పనులు టీటీడీ ఆగస్టు 1వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా స్వామి పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి నీటి అడుగు భాగంలో పేరుకున్న ఇసుకను, పాచిని తొలగించడానికి వాటర్ వర్క్స్ విభాగం దాదాపు వంద మంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడి స్వామి పుష్కరిణి శుద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేశారు.