TTD: తిరుమలలో పదిరోజుల పాటు వైకుంఠ దర్శనం - ధర్మారెడ్డి

TTD: వైకుంఠ ఏకాదశికి తిరుపతిలో టిక్కెట్ల పంపిణీ కౌంటర్లు

Update: 2022-12-01 02:15 GMT

TTD: తిరుమలలో పదిరోజుల పాటు వైకుంఠ దర్శనం - ధర్మారెడ్డి

TTD: తిరుమలలో వైకుంఠద్వార దర‌్శనానికి భక్తుల్ని పదిరోజులపాటు అనుమతించేవిధంగా నిర్ణయించామని టీటీడీ ‎ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో నూతన సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పదిరోజుల పాటు ప్రతిరోజూ సర్వదర్శనానికి 50వేలమందిని, చెల్లింపు సేవలద్వారా 25వేల మందికి వైకుంఠ దర్శనానికి అనుమతిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం పంపిణీ చేసినట్లే ఈ సంవత్సరం తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ టిక్కెట్లను పంపిణీచేస్తామని ధర్మారెడ్డి చెప్పారు.

శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే వీఐపీలకు అందుబాటులో ఉన్న సమయంలో దర్శనానికి పరిమిత సంఖ్యలో అనుమతించే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు.

వైకుంఠ దర్శనానికి ఉద్ధేశించిన టిక్కెట్లను పంపిణీ చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, టిక్కెట్లను పొందిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించే విధంగా పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. వైకుంఠదర్శనం అమల్లో ఉన్నపది రోజుల్లో టిక్కెట్లు పొందిన వారినిమాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతి ఉంటుందన్నారు. టిక్కెట్లు పొందలేని భక్తులు తిరుమలకు వచ్చినా... దర్శనానికి అనుమతించరనే విషయాన్ని గుర్తించాలన్నారు. తిరుపతిలో ఇస్తున్న ఉచిత టోకెన్లను తీసుకుని తిరుమలకు రావాలని సూచించారు.

లడ్డూ కౌంటర్లను మెయింటెయిన్ చేసే ప్రైవేటు కాంట్రాక్టు కార్మికులు అక్రమాలకు పాల్పడుతున్నారని చర్యలు తీసుకున్నామని ధర్మారెడ్డి తెలిపారు. చర్యలు తీసుకున్నామనే కారణంగా సామూహిక ఆందోళనతో ప్రత్యాయ్నాయ ఏర్పాట్లు చేశామని ధర్మారెడ్డి విరించారు. తొలిరెండు రోజులపాటు కాస్తా ఇబ్బందిగా ఉన్నప్పటికీ.. పరిస్థితి మెరుగు పడిందనే అభిప్రాయం వ్యక్తంచేశారు.

Full View
Tags:    

Similar News