AP TET 2024 Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..
AP TET 2024 Results: ఏపీ టెట్ ఫలితాలను సోమవారం ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి విడుదల చేశారు.
AP TET 2024 Results: ఏపీ టెట్ ఫలితాలను సోమవారం ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి విడుదల చేశారు. 50.79 శాతం మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. అంటే పరీక్ష రాసిన వారిలో 1, 87, 256 మంది టెట్ కు అర్హత సంపాదించారు. ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. అక్టోబర్ 29న తుది కీ విడుదల చేశారు. 4, 27,300 మంది టెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. 3, 68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు. తుది కీ విడుదల ఆలస్యంగా ఫలితాలను నవంబర్ 4 న విడుదల చేశారు.
వాస్తవానికి ఈ ఫలితాలను నవంబర్ 2నే విడుదల చేయాలి. రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 6న డీఎస్సీ నియామాకాల కోసం ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. డీఎస్సీ పరీక్షలను 2025 లో నిర్వహించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హమీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి లోకేష్ చెప్పారు. ఫలితాలను https://cse.ap.gov.in వెబ్ సైట్ లో చూడవచ్చు.