రౌడీలు, గూండాలను వదలొద్దు: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ప్రజల నుంచి భూములు లాక్కొని స్వంత ఆస్తి మాదిరిగా కొట్టుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు.

Update: 2024-11-05 10:16 GMT

రౌడీలు, గూండాలను వదలొద్దు: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ప్రజల నుంచి భూములు లాక్కొని స్వంత ఆస్తి మాదిరిగా కొట్టుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. మంగళవారం పల్నాడు జిల్లాలోని మాచవరం,దాచేపల్లి మండలాల్లో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ సంస్థకు చెందిన భూములను ఆయన పరిశీలించారు.

వైసీపీ నాయకులు ఇంకా ప్రభుత్వంలో ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. శాంతి భద్రతలు ఎంత బలంగా ఉన్నాయో వాళ్లకు తెలిసేలా చూపాలన్నారు. పోలీస్ అధికారులు మెత్తబడిపోయారా? లేక భయపడుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనని ఆయన చెప్పారు. రౌడీయిజాన్ని అరికట్టాల్సిన బాధ్యత పోలీసులదేనని ఆయన తేల్చి చెప్పారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడొద్దని ఆయన పోలీసులకు సూచించారు. రౌడీలు, గూండాలను ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని ఆయన పోలీసులను ఆదేశించారు.

మెత్తగా ఉంటే ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇష్టానుసారం ఎవరైనా మాట్లాడితే ఇకపై ఊరుకొనేది లేదన్నారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ సంస్థకు భూములిచ్చిన రైతులకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. 400 ఎకరాల అటవీ భూములంటే రెవిన్యూ భూములుగా మార్చి లాక్కున్నారని ఆయన ఆరోపించారు. 2009లో 30 ఏళ్లకు లీజుకు తీసుకొని మళ్లీ 50 ఏళ్లకు పెంచేశారన్నారు. 24.78 ఎకరాల కుంటలు, చెరువులు స్వాధీనం చేసుకున్నారన్నారు. సహజ వనరులు ఎవరి సొత్తు కాదన్నారు.

Tags:    

Similar News