Tirumala Canara Bank Kiosk Donations: తిరుమల శ్రీవారికి కెనరా బ్యాంక్ ఎంత విరాళం ఇచ్చిందో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం
Tirumala Canara Bank Kiosk Donations: తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కియోస్క్ మెషిన్ ను టీటీడీ ఏర్పాటు చేసింది.
Tirumala Canara Bank Kiosk Donations: తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కియోస్క్ మెషిన్ ను టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ మిషన్ను టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి బుధవారం దాన్ని ప్రారంభించారు. ఈ మెషిన్ను కెనరా బ్యాంకు టీటీడీకి విరాళంగా అందజేసింది. ఈ మిషన్ల ద్వారా భక్తులు ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు సులభతరంగా విరాళం అందించవచ్చని టీటీడీ పేర్కొంది.
రూ. 1 నుంచి రూ. 99,999 వరకు తమ తోచినంత మొత్తాన్ని భక్తులు కియోస్క్ మెషన్ లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపిఐ ద్వారా విరాళంగా ఇవ్వవచ్చు. టీటీడీని పూర్తిగా డిజటలైజేషన్ చేయడంలో భాగంగా ఈ మిషన్ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కియోస్క్ మిషన్లను ఏర్పాటు చేస్తామన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు లోకనాథం, రాజేంద్ర, కెనరా బ్యాంకు డీజీఎం రవీంద్ర అగర్వాల్, ఏజీఎం నాగరాజు రావు, తిరుమల బ్రాంచ్ మేనేజర్ రాఘవన్ పాల్గొన్నారు.
ఇక తిరుమలలో బుధవారం ఉదయం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర మూర్తి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.2021లో శ్రీరాములు వారి విగ్రహానికి సంబంధించిన ఎడమ చేయి మధ్య వేలి భాగంలో చిన్నపాటి భిన్నం ఏర్పడినట్లు గుర్తించారు. అప్పట్లో ఈ వేలుకు బంగారు కవచాన్ని తొడిగి ఏర్పడిన భిన్నాన్ని సవరించారు. ఇలాంటి చిన్నపాటి భిన్నాలు ఉత్సవమూర్తులకు ఏర్పడినప్పుడు 12ఏళ్లకు ఓసారి నిర్వహించే మహా సంప్రోక్షణ కార్యక్రమంలో సవరించడం పరిపాటి.
అయితే మహా సంప్రోక్షణ కార్యక్రమం 2018లో టీటీడీ నిర్వహించింది. తర్వాత మహా సంప్రోక్షణ కార్యక్రమం 2030లో జరగనుంది. దీనికి ఐదేళ్లకు పైగా సమయం ఉన్న కారణంగా జీయర్ స్వాములు ఆగమ సలహాదారులు, అర్చకులత కూడిన కమిటీ ఇటీవల బ్రహ్మోత్సవ సమయంలో ప్రస్తుత అధికారుల ద్రుష్టికి తీసుకురాగా..సదరు సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు కోరారు. ఈ కమిటీ నిర్ణయించిన మేరకు చిన్నపాటి భిన్నాలను ఆగమోక్తంగా సవరించేందుకు మంగళ, బుధవారాల్లో శ్రీరాములవారి ఎడమ చేయి అంగుళీ సంధాన సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రస్తుత టీటీడీ యాజమాన్యం అంగీకరించింది. ఈ కార్యక్రమం ద్వారా ఉత్సవ విగ్రహాలకు ఎలాంటి దోషం ఉండదని కమిటీ తెలిపింది.