ఇవాళ ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్న కేబినెట్

AP Cabinet Meeting: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సాయంత్రం 4 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది.

Update: 2024-11-20 07:18 GMT

ఇవాళ ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్న కేబినెట్

AP Cabinet Meeting: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సాయంత్రం 4 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. రూ.85 వేల కోట్ల పెట్టుబడులపై స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) తీసుకున్న నిర్ణయాలపై ఆమోదం తెలపనుంది. రాజధాని అమరావతికి సంబంధించి గతంలో కాంట్రాక్టర్లకు కేటాయించిన పనుల టెండర్ల రద్దుకు ఈ కేబినెట్‌లో ఆమోదం తెలపనున్నారు.

ఆయా పనులకు సంబంధించి కొత్త టెండర్లు పిలిచే విషయంపై ఈరోజు జరగబోయే కేబినెట్‌లో చర్చించి.. ఆ తర్వాత వాటికి ఆమోద ముద్ర వేయనున్నారు. ఇనామ్ భూముల అంశంపై నిర్ణయం తీసుకోంది. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైనా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఏపీఎస్‌ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణంపై ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినట్టు సమాచారం.

Tags:    

Similar News