లోకేష్ పై వ్యాఖ్యలు: వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కు 41 ఎ నోటీసులు

ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ కు పోలీసులు సోమవారం 41 ఎ నోటీసులు జారీచేశారు.

Update: 2024-11-18 08:35 GMT

లోకేష్ పై వ్యాఖ్యలు: వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కు 41 ఎ నోటీసులు

ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ కు పోలీసులు సోమవారం 41 ఎ నోటీసులు జారీచేశారు. సోషల్ మీడియాలో లోకేష్ పై ఈ ఏడాది సెప్టెంబర్ 18న సర్కార్ వారి పేకాట.. అంటూ ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఈ పోస్టుపై చర్యలు తీసుకోవాలని ఎర్రగొండపాలెనికి చెందిన కిషోర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. మరో వైపు ఈ పోస్టుపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్పందించారు. ఇందుకు తగిన ఆధారాలు ఉంటే ఇవ్వాలని సూచించారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

ఈ నెల 9న విచారణకు రావాలని పోలీసులు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. కానీ, నవంబర్ 9న విచారణకు ఆయన హాజరుకాలేదు. ఇదే నియోజకవర్గంలోని పుల్లలచెరువులో కూడా ఆయనపై కేసు నమోదైంది. ఈ నెల 9న ప్రశ్నించేవారిని గొంతులను నొక్కే ఉద్దేశంతో కేసులు బనాయిస్తున్నారని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో చంద్రశేఖర్ ఒకరు.

Tags:    

Similar News