AP Schools: ఏపీలో పాఠశాలల టైమింగ్స్‌లో మార్పులు.? సాయంత్రం ఎప్పటివరకంటే..
School Timings: ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
School Timings: ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల సమయాల్లో మార్పులు చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉన్న పనివేళలను ఒక గంట పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇకపై స్కూళ్లు 5 గంటలకు పని చేస్తాయన్నమాట.
ఇందులో భాగంగానే పైలక్ ప్రాజెక్టును చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలానికి రెండు పాఠశాలల్లో ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని తాజాగా పాఠశాలకు ఆదేశాలు జారీ చేశారు. ఎంపిక చేసిన కొన్ని స్కూళ్లలో నవంబర్ 25 నుంచి 30వ తేదీ వరకు సమయాన్ని పొడగించనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత అన్ని పాఠశాలల్లో ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
విద్యార్థులకు సబ్జెక్టులను బోధించేందుకు అదనపు సమయం కావాలనే ఉద్దేశంతో గంట సమయం పొడిగించామని విద్యా శాఖ ప్రకటించింది. పైలట్ ప్రాజెక్టులో వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ సూచనల ఆధారంగా ఈ విద్యా సంవత్సరంలో పాఠశాల సమయాలను మార్చాలని భావించారు.
ఈ నేపథ్యంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లందరూ ప్రతి మండలం నుంచి ఒక హైస్కూల్ / హైస్కూల్ ప్లస్‌ని గుర్తించి, పాఠశాలల జాబితాను 20.11.2024న సంతకం చేసిన వారికి సమర్పించాలని అభ్యర్థించారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పునరాలోచించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. 5 కిలోమీటర్ల పరిధి నుంచి విద్యార్థులు పాఠశాలలకు వస్తుండడంతో సాయంత్రం 5 గంటల వరకు స్కూళ్లలో ఉంటే ఇళ్లకు చేరేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని, వాతావరణంతో పాటు ఇంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని.. ‘పొడిగింపు’ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.