Unknown Facts About Tirumala: తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయం గురించి ఎవరికీ తెలియని నిజాలు

Unknown Facts About Tirumala: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేవాలయంగా తిరుమల శ్రీవేంకటేశ్వరున్ని ఆరాధిస్తారు. తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. వాటిలో ఆశ్చర్యపరిచే కొన్ని నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Update: 2024-11-17 08:47 GMT

Unknown Facts About Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం. భారతదేశంలో అత్యంత ధనిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశం. మనకు తెలిసిన విషయాల కంటే తెలియని అంతుచిక్కని రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. తిరుమల వేంటేశ్వరునికి తల భాగంలో నిజమైన వెంట్రుకలు ఉన్నాయని..శ్రీవారిని పూజించే వస్తువులన్నీ స్థానికంగా లభించేవి కావని..శ్రీవారి విగ్రహానికి చెమట పడుతుందనే ఎన్నో ఆసక్తికర విషయాలు తిరుమలకు వెళ్లే భక్తుల్లో చాలా మందికి తెలియవు. ఇలా తిరుమల గురించి చాలా మంది భక్తులకు, పర్యాటకులకు తెలియని మరెన్నో ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం.

1. ఎవరికీ తెలియని రహస్య గ్రామం:

శ్రీవేంకటేశ్వరుని ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, పవిత్రమైన మూలికలు ఇలా ఎన్నో పదార్థాలను తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు. ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి ఎవరికీ తెలియకపోవడం విశేషం. ఇక్కడి ప్రజలు ఎంతో నియమ నిష్టలతో ఉంటూ..గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరం అయ్యే ప్రతి సామాగ్రిని ఇక్కడి నుంచే తీసుకువెళ్తారు.

2. శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు:

స్వామివారి విగ్రహం గర్భగుడిలో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ నిజానికి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడివైపు మూలలో ఉంటుంది. సరిగ్గా చూసినవారికే అది స్పష్టంగా కనిపిస్తుంది.

3. శ్రీవారికి జుట్టు :

వేంకటేశ్వరస్వామి వారి విగ్రహానికి పట్టులాంటి నిజమైన జుట్టు ఉంటుంది. దీని వెనక ఓ ఆసక్తికరమైన కథనం కూడా ఉంది. వేంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించిన ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు. ఇది గమనించిన నీలదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుందట. తన తల నీలాలను స్వీకరించాలని కోరుతుందట. ఆమె భక్తికి మెచ్చిన వేంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తాడు. అప్పటి నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు తమ కోరికలు తీరక ముందు, తీరిన తర్వాత తలనీలాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.

4. విగ్రహం వెనక సముద్ర ఘోష:

శ్రీవారి విగ్రహం వెనక నుంచి ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుంది. స్వామివారి విగ్రహం వెనక నుంచి చెవు పెట్టి వెంటే ఇది స్పష్టంగా తెలుస్తుంది. కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు అవకాశం ఉండదు.

5. కొండెక్కని దీపాలు :

గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందు ఉంచే మట్టి దీపాలు ఎప్పుడూ కూడా కొండెక్కవు. స్వామి దర్శనానికి వచ్చే భక్తుల నిర్మలమైన మనస్సుకు ఇవి ప్రతీకగా నిలుస్తాయి. ఈ దీపాలను ఎప్పుడు, ఎవరు వెలిగించారనే విషయాలు ఎవరికీ తెలియవు. కొన్నివేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట ఉంటాయి.

6. విగ్రహ రహస్యం:

శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో ఉంటుంది. పూజారులను ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ మళ్లీ తడిగా మారడం విస్మయం కలిగించే అంశం.

7. శ్రీవారికి చెమటలు :

స్వామివారి విగ్రహం రాతితో తయారు చేసినదే అయినా ఎప్పుడూ సజీవమైన జీవకళతో కనిపిస్తుంది. స్వామివారి విగ్రహం ఎప్పుడూ 110 డిగ్రీల ఫారిన్ హీట్ తో వేడిగా ఉంటుందట. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండటంతో తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి. కానీ స్వామివారి విగ్రహం మాత్రం వేడిగా చెమటలు చిందిస్తూ ఉంటుందట. అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటారు.

8. ప్రత్యేకమైన కిరీటం

తిరుమల శ్రీవేంకటేశ్వరుడు ధరించిన సామ్రాజ్య కిరీటం మధ్యలో మేరు పచ్చ అనే భారీ పచ్చని అమర్చారు. 3 అంగుళాల వ్యాసంతో 96 క్యారేట్ మేరు పచ్చ ప్రపంచంలోనే అతిపెద్ద పచ్చగా పరిగణిస్తారు.

Tags:    

Similar News