శ్రీరెడ్డిపై బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో కేసు
Case Files On Sri Reddy: సినీ నటి శ్రీ రెడ్డి (Sri Reddy) పై తూర్పు గోదావరి జిల్లా బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు చేశారు.
Case Filed On Sri Reddy: సినీ నటి శ్రీ రెడ్డిపై తూర్పు గోదావరి జిల్లా బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వి. అనితపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో తెలిపారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
అనకాపల్లిలో కూడా ఫిర్యాదు
మరో వైపు అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో శ్రీరెడ్డిపై టీడీపీ మహిళ ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి, చెన్నా సత్యవతి, యర్రంశెట్టి ఈశ్వరి, కె. వసంత ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు.
క్షమించాలని వీడియో రిలీజ్
సోషల్ మీడియాలో తాను చేసిన వ్యాఖ్యలపై శ్రీరెడ్డి నాలుగు రోజుల క్రితం ఓ వీడియోను విడుదల చేశారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తనను క్షమించాలని ఆమె ఆ వీడియోలో కోరారు. పవన్ కళ్యాణ్, లోకేష్, అనిత కుటుంబసభ్యులకు క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో ఇలా చేయనని ఆమె తెలిపారు. నాయకులతో యుద్ధం చేయాలని కోరారు. కార్యకర్తలతో చేయవద్దని కోరారు.
శ్రీరెడ్డి వీడియోపై మంత్రి కొల్లు రియాక్షన్
సోషల్ మీడియాలో ఇష్టారీతిలో కామెంట్స్ చేసి వాటిపై కేసులు నమోదు చేస్తుంటే ఇప్పుడు ఏడిస్తే ఏం ప్రయోజనమని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. సోషల్ మీడియాలో తప్పు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై చర్యలు ప్రారంభమయ్యాయి. కక్షపూరితంగానే తమ పార్టీని లక్ష్యంగా చేసుకొని కేసులు నమోదు చేస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ ఆరోపణలు చేస్తోంది. చట్టప్రకారంగానే వ్యవహరిస్తున్నామని టీడీపీ చెబుతోంది.