Raghu Ramakrishna Raju: డిప్యూటీ స్పీకర్‌‌గా రఘు రామకృష్ణ రాజు ఎన్నికవడానికి ముందు ఏం జరిగింది?

Raghu Ramakrishna Raju as Deputy Speaker: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష్ణ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Update: 2024-11-14 16:04 GMT

Raghu Ramakrishna Raju as Deputy Speaker: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష్ణ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో వైసీపీ ఎంపీగా పనిచేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన రఘురామ కృష్ణ రాజు డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రఘురామకు పోటీగా ఇంకెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు స్పీకర్ ప్రకటించారు.

రఘు రామకృష్ణ రాజు 1962 లో మే 14న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో కనుమూరు వెంకట సత్య సూర్యనారాయణ రాజు, అన్నపూర్ణ దంపతులకు జన్మించారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఫార్మసీ చదివారు. ఆ తర్వాత 1980లో రామాదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.

రఘు రామకృష్ణ రాజుకు 2014లో లోక్ సభ ఎన్నికలకు వైసీపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2018లో బీజేపీని వీడి టీడీపీలో చేరారు. అనంతరం 2019 మార్చిలో మళ్లీ వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీకి చెందిన వేటుకూరి వెంకట శివరామరాజు పై 31 వేల 909 ఓట్ల తేడాతో తొలిసారి విజయం సాధించారు.

ఆ తర్వాత ఆరు నెలల్లోనే అప్పటి వైసీపీ ప్రభుత్వంతో విభేదించి జగన్‌పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఎంపీగా అనర్హులుగా ప్రకటించాలని వైసీపీ లోక్ సభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేసింది. ఆ తర్వాత ఏపీలో జగన్ మత ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ రఘు రామకృష్ణ రాజు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆ తర్వాత ఆ పార్టీ రెబల్ ఎంపీగా మారి జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయనపై రాజద్రోహం కేసు కూడా నమోదైంది. ఆ కేసులో ఆయన జైలుకు వెళ్లారు. జైలులో తనను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని ఆయన మీడియా ఎదుట వాపోయారు. తర్వాత ఆ కేసులో సుప్రీంకోర్టుకెళ్లి బెయిల్ తెచ్చుకున్నారు. చివరికి ఎంపీగా ఉంటూనే ఐదేళ్ల పాటు నియోజకవర్గానికి సైతం దూరమయ్యారు.

Full View

ఈ క్రమంలో కూటమికి దగ్గరైన రఘు రామకృష్ణం రాజుకు టీడీపీ నుండి ఎంపీ టికెట్ లభిస్తుందని భావించినా అలా జరగలేదు. చివర్లో టీడీపీలో చేరి ఉండి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని గెలిచారు. అనంతరం ప్రభుత్వంలో కీలక పదవి ఉంటుందని భావించారు. అదీ జరగలేదు. చివరికి స్పీకర్ పదవి అయినా దక్కుతుందని ఆశించినప్పటికీ ఆ అవకాశం కూడా రాలేదు. తాజాగా రఘురామకు డిప్యూటీ స్పీకర్‌ అయ్యే అవకాశం కల్పించారు. దీంతో ఆయన తొలిసారి కొత్త పాత్రలో కనిపించనున్నారు. డిప్యూటీ స్పీకర్‌గా రఘరామ ఎన్నికపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. రఘురామ డిప్యూటీ స్పీకర్‌ అయితే, వైఎస్ జగన్ అసెంబ్లీకి కూడా రారేమో అని ఆమె వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News