CM Chandrababu: నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు
CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.
CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం ఢిల్లీలోని హిందుస్థాన్‌టైమ్స్ నిర్వహించే కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటవరకు అసెంబ్లీ హాజరై అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి.. జనపథ్‌కు చేరుకోనున్నారు.
రేపు ఉదయం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌తోపాటు పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు. భేటీ అనంతరం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు వెళ్లనున్నారు. ఎన్డీయే భాగస్వామిగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రచారం చేయనున్నారు.