Weather Report: ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. రెండు రోజుల్లో భారీ వర్షాలు
Weather Report: ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత భారీగా పెరిగింది. మంచు విపరీతంగా కురుస్తోంది. దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన కూడా ఉంది. కానీ తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఎలాంటి వర్ష సూచన లేదని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఉష్ణోగ్రతలు మాత్రం మరింత తగ్గుతాయని..తెలుగు రాష్ట్రాల్లో 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ కు తగ్గుతాయని తెలిపింది. దక్షిణ అండమాన్ తీరంలో ఒక ఆవర్తనం గురువారం ఏర్పడనుంది.
అది ఆగ్నేయ బంగాళాఖాతం వైపు కదులుతూ నవంబర్ 23కి అల్పపీడనంగా మారుతుందని ఆ తర్వాత నైరుతీ బంగాళాఖాతం వైపు కదులుతూ నవంబర్ 25 నాటికి వాయుగుండంగా మారుతుందని ఐఎండీ తెలిపింది. దాని ప్రభావం రాయలసీమపై కనిపించే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు కాస్తాయి. దక్షిణ రాయలసీమలో మాత్రం మేఘాలు కమ్ముకుంటాయి. పొడివాతావరణం ఉంటుంది. ఎక్కడ కూడా జల్లులు కురిసే అవకాశం ఉండదు. గాలి వేగం కూడా పెరిగింది. తెలంగాణలో మ్యాగ్జిమం 11కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.
బంగాళాఖాతంలో గాలులు అండమాన్ వైపు కదులుతున్నాయి. తెలంగాణలో పగటివేళ ఉష్ణోగ్రత మ్యాగ్జిమం 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో మ్యాగ్జిమం 31 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుంది. రాత్రివేళ తెలంగాణలో 17 డిగ్రీల సెల్సియస్, ఏపీలో 21 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అందుకే రాత్రి ప్రజలు చలి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి.