గత 5 ఏళ్లలో చాలా తప్పులు జరిగాయి: ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు సంచలన వ్యాఖ్యలు

DGP Dwaraka Tirumalarao: గత ఐదేళ్లలో కొన్ని తప్పులు జరిగాయని ఒప్పుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు.

Update: 2024-11-05 07:33 GMT

DGP Dwaraka Tirumalarao: ఐదేళ్లలో తప్పులు జరిగాయి..

DGP Dwaraka Tirumalarao: గత ఐదేళ్లలో కొన్ని తప్పులు జరిగాయని ఒప్పుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. అనంతపురంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దడంపై దృష్టి పెట్టామని ఆయన చెప్పారు. మానవ హక్కులు, మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన తేల్చి చెప్పారు. ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండేలా పోలీస్ వ్యవస్థలో చర్యలు చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఐజీ సంజయ్ పై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చేయిస్తోందన్నారు. దీనిపై విచారణ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని ఆయన వివరించారు. గత ప్రభుత్వంలో పోలీసులు సరిగా విధులు నిర్వహించలేదన్నారు. ఓ పార్టీ కార్యాలయంపై దాడి జరిగినా పోలీసులు బాధ్యతగా వ్యవహరించలేదని తేల్చి చెప్పారు. బావ ప్రకటన స్వేచ్ఛ వల్ల దాడి జరిగిందని పోలీసులు రాసుకున్నారని ఆయన మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానమిచ్చారు.

ఓ పార్టీ ఆఫీస్ పై దాడి జరిగితే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదన్నారు. అయితే మూడేళ్ల తర్వాత చర్యలు ఏంటని ప్రశ్నించడం సరికాదని ఆయన అన్నారు. తప్పు జరిగితే 30 ఏళ్ల తర్వాతనైనా చర్యలు తీసుకోవచ్చని ఆయన స్పష్టత ఇచ్చారు. కేరళలో తప్పు జరిగిన తర్వాత 20 ఏళ్లకు ఓ ఐపీఎస్ అధికారికి శిక్ష విధించిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. చట్టాలు, కోర్టులు ఉన్నదని న్యాయం చేసేందుకేనని ఆయన అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోలీస్ శాఖపై చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా దీనిపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.

Tags:    

Similar News