Kuppam: కుప్పంలో వైఎస్ఆర్ సీపీకి షాక్.. టీడీపీలో చేరిన కీలక నేత

Kuppam: కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవికి డాక్టర్ సుధీర్ మంగళవారం రాజీనామా చేశారు.

Update: 2024-11-05 07:19 GMT

Kuppam: కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవికి డాక్టర్ సుధీర్ మంగళవారం రాజీనామా చేశారు. వైఎస్ఆర్ సీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆయన టీడీపీలో చేరారు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో 89 గ్రామపంచాయితీల్లో 74 చోట్ల వైఎస్ఆర్ సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. కుప్పం మున్సిపాలిటీలో వైఎస్ఆర్ సీపీ పాగా వేసింది. ఈ ఎన్నికల సమయంలో అప్పటి ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు టీడీపీ అప్పట్లో ప్రకటించింది.

అయితే కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్ధులు బరిలోకి దిగారు. కుప్పంలో 25 వార్డులున్నాయి. ఇందులో ఆరుగురు టీడీపీ కౌన్సిలర్లు గెలిచారు. మిగిలిన 19 చోట్ల వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధులు గెలిచారు. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి మారింది. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ తో పాటు మరో 11 మంది వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్లు ఆ పార్టీని వీడారు. అయితే స్థానిక టీడీపీ నాయకత్వం వీరి రాకను వ్యతిరేకిస్తోంది. దీంతో వీరి చేరికకు ఆలస్యమైంది. తాజాగా డాక్టర్ సుధీర్ మున్సిపల్ చైర్మన్,కౌన్సిలర్ పదవులకు కూడా రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

Tags:    

Similar News