Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..ఇక ప్రతి శనివారం ఆన్ లైన్లో టోకెన్లు, బుక్ చేసుకోవచ్చు
Tirumala Srivari Angapradakshinam: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి శనివారం కేటాయిస్తున్న 250 శ్రీవారి ఆలయ అంగ ప్రదక్షిణ టోకెన్లను ఇక నుంచి లక్కీడప్ ద్వారా కేటాయించనున్నట్లు టీటీడీ తెలిపింది. తిరుపతి నగరవాసులతోపాటు తిరుమలవాసులకు ఈ టోకెన్లను కేటాయిస్తారు. ఈ టోకెన్లు కావాల్సిన భక్తులు..గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ ఆధార్ కార్డుతో ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీరికి సాయంత్రం 5గంటలకు లక్కీడీప్ ద్వారా టోకెన్లను కేటాయిస్తారు.
Tirumala Srivari Angapradakshinam Tokens Lucky Dip: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి శనివారం తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులకు కేటాయిస్తున్న 250 శ్రీవారి ఆలయ అంగప్రదక్షిణ టోకెన్లు..ఇక నుంచి లక్కీడీప్ ద్వారా కేటాయించున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ అంగప్రదక్షిణ టోకెన్లు కావాల్సిన భక్తులు గురువారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు తమ ఆధార్ కార్డుతో ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత వీరికి సాయంత్రం 5గంటలకు లక్కీడీప్ ద్వారా టికెట్లను కేటాయిస్తారు.
ఈ విధంగా లక్కీడీప్ లో టోకెన్లు తీసుకున్న భక్తులు వారి మొబైల్ కు మెసేజ్ ద్వారా సందేశం పంపిస్తారు. అలగే ఆన్ లైన్లో కూడా ఈ టోకెన్లను ఉంచుతారు. లక్కీడీప్ లో టికెట్లు పొందిన భక్తులు ఆన్ లైన్ లో రూ. 500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లక్కీ డీప్ లో టికెట్లు పొందిన భక్తులు మహతి కళాక్షేత్రంలో తమ ఆధార్ కార్డును చూపించాలి. శుక్రవారం మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 8గంటల వరకు అంగప్రదక్షిణ టికెట్లను పొందవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.
లక్కీ డీప్ లో అంగప్రదక్షిణ టికెట్లు పొందన భక్తులు శనివారం తెల్లవారుజామున అంగప్రదక్షిణకు అనుమతి ఇస్తారు. తర్వాత భక్తులు చెల్లించిన రూ. 500 డిపాజిట్ ను తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తుంది. తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులు కానీ భక్తులు లక్కీడీప్ లో అంగప్రదక్షిణ టోకెన్లు పొందినవారికి వారు చెల్లించిన రూ. 500 డిపాజిట్ టిటిడి తిరిగి చెల్లించదు. ఈ విషయాన్ని గమనించి భక్తులు సహకరించాలని విజ్నప్తి చేసింది టీటీడీ