TTD: తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు

TD: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తులకు శుభవార్త. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించి తాజాగా తేదీలను ప్రకటించింది టీటీడీ. అక్టోబర్ 4 నుంచి12 వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఘనంగా జరపనున్నట్లు టీటీడీ తెలిపింది.

Update: 2024-08-19 23:54 GMT

TTD: తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు

TTD: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తులకు శుభవార్త. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించి తాజాగా తేదీలను ప్రకటించింది టీటీడీ. అక్టోబర్ 4 నుంచి12 వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఘనంగా జరపనున్నట్లు టీటీడీ తెలిపింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతీరోజు ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 10గంటల వరకు వాహనసేవలు ఉంటాయని టీటీడీ అధికారులు తెలిపారు. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం నుంచి అంకురార్పణతో ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగానే ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వాహన సేవలు ఉంటాయి. ఈ క్రమంలోనే అక్ోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఏ రోజు ఏ ఉత్సవాలు జరగనున్నయో టీటీడీ వివరాలను వెల్లడించింది.

-అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 5:45 నుంచి 6 గంటల వరకు ధ్వజారోహణం. అదే రోజు రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.

అక్టోబర్ 5- ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం. మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు స్నపనం. రాత్రి 7 గంటలకు హంస వాహనం.

6- ఉదయం 8 గంటలకు సింహ వాహనం. మధ్యాహ్నం ఒంటి గంటకు స్నపనం. రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం.

7- ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం. మధ్యాహ్నం 1 గంటకు స్నపనం. రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం.

8- ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం.

9- ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం. సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం. రాత్రి 7 గంటలకు గజ వాహనం.

10- ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం.

11- ఉదయం 7 గంటలకు రథోత్సవం. రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం.

అక్టోబర్ 12- ఉదయం 6 నుంచి 9 వరకు చక్రస్నానం. రాత్రి 8:30 నుంచి 10:30 వరకు ధ్వజావరోహణం.

Tags:    

Similar News