Tirumala: తిరుమలలో అపచారం.. శ్రీవారి దర్శనానికి చెప్పులతో వచ్చిన భక్తులు
Tirumala: తిరుమలలో అపచారం జరిగింది. శ్రీవారి దర్శనానికి కొందరు భక్తులు చెప్పులతో వచ్చారు.

Tirumala: తిరుమలలో అపచారం.. శ్రీవారి దర్శనానికి చెప్పులతో వచ్చిన భక్తులు
Tirumala: తిరుమలలో అపచారం జరిగింది. శ్రీవారి దర్శనానికి కొందరు భక్తులు చెప్పులతో వచ్చారు. మహాద్వారం దగ్గర గుర్తించిన టీటీడీ సిబ్బంది.. చెప్పులను చెత్తబుట్టలో వేయించి అనంతరం లోపలికి అనుమతించారు. అయితే చెప్పులతో మహాద్వారం వరకు ఎలా వచ్చారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దర్శనం లైన్లలోకి ప్రవేశించే ముందే సిబ్బంది ఎలా వదిలేశారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
తిరుమలకు వచ్చే భక్తులు కొండపై ఎంతో భక్తిశ్రద్దలతో ఉంటారు.. ఆలయాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. కొందరు భక్తులు తిరుమల మాఢ వీధుల్లో కూడా పాదరక్షలు వేసుకోరు.. కానీ అలాంటిది ఈ ముగ్గురు భక్తులు మాత్రం చెప్పులు వేసుకుని తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆలయంలోకి రావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తులకు కనీసం ఆ తెలివి కూడా లేదా అని ఆగ్రహం వ్యక్తమవుతోంది.