Happy Birthday Chandrababu: చంద్రబాబు @75..ఏపీ సీఎం గురించి ఎవరికీ తెలియని విషయాలివే

Update: 2025-04-20 04:01 GMT
Happy Birthday Chandrababu: చంద్రబాబు @75..ఏపీ సీఎం గురించి ఎవరికీ తెలియని విషయాలివే
  • whatsapp icon

Happy Birthday Chandrababu: నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. చంద్రబాబు 75వ జన్మ దినం సందర్భంగా ఆయన గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. చంద్రబాబు పుట్టి పెరిగింది నారావారిపల్లే.ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఓ కుగ్రామం. ప్రాథమిక పాఠశాల కూడా లేదు ఆ గ్రామంలో. 16కిలోమీటర్ల మేర నడిచి చంద్రగిరిలో చదువుకున్నారు.

2. మధ్యాహ్న భోజనం అరిటాకులో చుట్టుకుని..బడికి వెళ్లేవారు. వర్షాకాలంలో వాగులు పొంగేవి. దీంతో అడ్డదారిన ఏ అర్థరాత్రికో ఇంటికి చేరుకునేవారు.

3. తండ్రి కర్జూరనాయుడు రైతు. సెలవుల్లో నాన్న వెంట పొలానికి వెళ్లేవారు.

4. అప్పుడప్పుడు పశువులను మేతకు తీసుకెళ్లవారు. 7వ తరగతి, 10వ తరగతి పాస్ అయితే కొండకు వస్తానని మొక్కుకునేవారట. ఆ విధంగా మొక్కు తీర్చుకునేందుకు స్నేహితులకు కలిసి నడకన ఏడుకొండలు ఎక్కేవారట

5. ఆయన తండ్రి గ్రామపెద్దల్లో ఒకరు. నాన్న ప్రభావంతో చంద్రబాబు కూడా నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడేవారు.

6. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదివేటప్పుడు విద్యార్థి సంఘ నాయకుడిగా ఎన్నికయ్యారు. క్యాంపస్ రాజకీయాల్లోనూ చురుకైన పాత్ర పోషించారు.

7. ఎన్ని వ్యాపకాలున్నా చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఎమ్మేలో క్లాస్ లో సెకండ్ వచ్చారు. నారావారి పల్లెలో పీజీ చేసిన రెండో వ్యక్తి చంద్రబాబు

8. ఎన్టీఆర్, ఎన్నార్ సినిమాలు బాగా చూసేవారు. వాలీబాల్, ఫుట్ బాల్ ఆడేవారు. ఆర్ధిక శాస్త్రంలో పీజీ చేశారు. అదే యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ గా ఉంటూ రాజకీయాలవైపు అడుగులు వేశారు.

9. 28ఏళ్ల వయసులో యువ శాసనసభ్యుడిగా అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చారు. చట్టసభ ఆవరణలో వైఎస్సార్ తో పరిచయం ఏర్పడింది. వారిద్దరి పరిచయం స్నేహంగా మారింది.

10. 1980-1983లో పురావస్తు, సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్థక, చిన్ననీటి పారుదల వంటి శాఖలకు మంత్రిగా ఉన్నారు.

11. సినిమాటోగ్రఫీ తర్వాత ఎన్టీఆర్ ను కలవాలనుకన్నారు. అనురాగదేవత షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ తో మాట్లాడారు. చంద్రబాబు వ్యక్తిత్వం ఎన్టీఆర్ కు నచ్చింది. ఆయన తో బంధుత్వం కలుపుకోవాలనుకున్నారు. 1981లో కూతురు భువనేశ్వరితో చంద్రబాబు పెళ్లి చేశారు. అంతలోనే అనేక పరిణామాలు సంభవించాయి. 1982 ఎన్టీఆర్ టీడీపీ నిస్థాపింపించి సీఎం అయ్యారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి చంద్రబాబు ఓడిపోయారు.

12. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. ఎన్ని పనులు ఉన్నా ఉదయం ఓ అరగంట మాత్రం పూర్తిగా కుటుంబానికే అంకితం చేస్తారు.

Tags:    

Similar News