AP SSC 10TH Class Results: నేడు ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

AP SSC 10TH Class Results: ఏపీలో నేడు పదవ తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పదవ తరగతి పరీక్షా ఫలితాలను ఉదయం 10గంటలకు విద్యాశాఖ ఆన్ లైన్ లో విడుదల చేస్తుంది. ఎక్స్, వాట్సాప్, మనమిత్ర వేదికలపై ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. అభ్యర్థుల ఫలితాలు https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్ సైట్లు, ‘మన మిత్ర’ (వాట్సాప్), LEAP మొబైల్ యాప్ లలో అందుబాటులో ఉంటాయి.
అంతేకాదు వాట్సాప్ లో 9552300009 నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపి, విద్యా సేవలను ఎంచుకుని, ఆపై SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, వారి రోల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా వారి ఫలితాల PDF కాపీని పొందవచ్చు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల లాగిన్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. LEAP మొబైల్ యాప్ ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్‌ల ద్వారా కూడా ఫలితాలు పొందే సౌలభ్యం కూడా ఉంది.
కాగా ఈ ఏడాది మార్చి 17 నుంచి మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,450పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించారు. మొత్తం 6,19,275 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు. ఈ ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.