AP SSC Results: ఏపీ టెన్త్ రిజల్ట్స్ రిలీజ్.. ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి

Update: 2025-04-23 04:53 GMT
AP SSC Results: ఏపీ టెన్త్ రిజల్ట్స్ రిలీజ్.. ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
  • whatsapp icon

AP SSC Results: ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ మేరకు మంత్రి నారాలోకేశ్ ఫలితాలను విడుదల చేశారు. ఓపెన్ స్కూల్ టెన్త్, ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్ష ఫలితాలను కూడా రిలీజ్ చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను https://results.bse.ap.gov.in/ వెబ్ సైట్ తోపాటు మన మిత్ర, వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మన మిత్ర వాట్సాప్ నెం. 9552300009 కు హాయ్ అని మెసేజ్ పెట్టండి. విద్యా సేవలను సెలక్ట్ చేసి ఫలితాలు పీడీఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. తాజాగా విడుదల అయిన పదవ తరగతి ఫలితాల్లో 81.14 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అందులో అబ్బాయిలు 78.31శాతం ఉన్నారు. అమ్మాయిలు 84.09 శాతం ఉత్తీర్ణత సాధించారు.

కాగా ఈ ఏడాది మార్చి 17 నుంచి మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,450పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించారు. మొత్తం 6,19,275 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు. 

Tags:    

Similar News