AP SSC Results: విద్యార్థులకు బిగ్ అలర్ట్..రేపు ఏపీ టెన్త్ రిజల్ట్స్ రిలీజ్

TS 10th Result 2025: పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..92.78శాతం ఉత్తీర్ణత
AP SSC Results: ఏపీ టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఈనెల 23న ఉదయం 10గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. టెన్త్ క్లాస్ రెగ్యులర్ తోపాటు సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఫలితాలను https://bse.ap.gov.in లేదా https://apopensschool.ap.gov.in వెబ్ సైట్ల ద్వారా పొందవచ్చు. మన మిత్ర, వాట్సాప్ యాప్, లీప్ మొబైల్ యాప్స్ లోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి. మన మిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 కు హాయ్ అని మెసేజ్ చేసి విద్యాసేవలకు సెలక్ట్ చేసి ఆ తర్వాత ఎస్ఎస్ సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను సెలక్ట్ చేసుకోవాలి. అభ్యర్థి రూల్ నెంబర్ ఎంటర్ చేస్తే..ఫలితాలు పీడీఎఫ్ రూపంలో కనిపిస్తాయి.