AP DSC Schedule: ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. ఏపీలో మెగా డిఎస్సీ షెడ్యూల్ రిలీజ్

AP DSC Schedule: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్బంగా ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వినిపించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మెగా డిఎస్సీ షెడ్యూల్ ను శనివారం రాత్రి ప్రకటించారు. చెప్పినట్లుగానే మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏపీ పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ 20న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మంత్రి నారాలోకేశ్ తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 6 నుంచి జులై 6 వరకు సీబీటీ విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ లో పేర్కొన్నారు. మెగా డీఎస్సీకి సంబంధించి పూర్తి వివరాలు ఈ లింక్స్ ను క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.