5. TTD: వేసవి సెలవుల్లో వీఐపీ, సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు

Update: 2025-04-27 01:18 GMT
5. TTD: వేసవి సెలవుల్లో వీఐపీ, సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు
  • whatsapp icon

TTD: వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వీఐసీ, సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు టీటీడీ బోర్డు సభ్యుడు, కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడారు. మే, జూన్ రెండు నెలలపాటు సెలవుల కారణంగా కుటుంబాలతో తిరుపతికి వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుదని తెలిపారు. భక్తులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశ్యంతోనే మే 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు వీఐసీ దర్శనాలతో పాటు సిఫార్సు లేఖలపై సేవలు, బ్రేక్ దర్శనాలు, సుప్రభాతం దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

Tags:    

Similar News