Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్

Rain Alert: భారత వాతావరణ శాఖ తాజా బులిటెన్ ప్రకారం..తెలుగు రాష్ట్రాలతోపాటు యానాం, రాయలసీమలో వారం పాటూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ వర్షాలతోపాటు పిడుగులు కూడా పడతాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఒక్కోసారి వేగం పెరిగి గంటకు 50 కిలోమీటర్ల వరక కూడా చేరుతుంది. పిడుగుల పడే సమయంలో గాలివేగం గంటకు 50 నుంచి 60కిలోమీటర్ల వరకు చేరవచ్చని ఐఎండీ హెచ్చరించింది.
నేడు ఏపీలో ముఖ్యంగా కోస్తా ప్రాంతాలు, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ వర్షాల సమయంలో గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. ఉత్తర కోస్తా, యానాంలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలో హైదరాబాద్, కొన్ని జిల్లాల్లో సాయంత్రం వేళల్లో ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఈ వర్షాలు హీట్ వేవ్ నుంచి కొంత ఉపశమనం కలిగిస్తాయి. కానీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం పడే సమయంలో చెట్లకిందకు వెళ్లకూడదని చెబుతున్నారు. మనం శాటిలైట్ అంచనాలను చూస్తే ఈ ఆదివారం నాడు ఉదయం వేళ ఉత్తర తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయి. తిరిగి సాయంత్రం వేళ హైదరాబాద్, ఆ చుట్టుపక్కల వాన మొదలై..రాత్రి 8గంటల వరకు కురిసే ఛాన్స్ ఉంటుంది. తెలంగాణపై రోజంతా మేఘాలు పరుగులు పెడుతుంటాయి. గాలి వీచినప్పుడు ఉపశమనంగా ఉంటుంది.
ఇక వర్షాలు వారం పాటు కొనసాగే అవకాశం ఉంది. దాని కారణం హిందూ మహాసముద్రంలో భారీగా వేడి పెరిగి, మేఘాలు తయారువుతున్నాయి. అవి కేరళ వైపుగా వెళ్తూ అక్కడి నుంచి కర్నాటక, తెలంగాణ వైపు వస్తున్నాయి. తెలంగాణలో వర్షం కురవకపోతే ఆ మేఘాలు ఏపీ వైపు వెళ్తుంటాయి. ఇదంతా ఒక పెద్ద సుడిలాంటిది తిరుగుతుంది. అది తుపాన్ కాదు కానీ ఈదురుగాలుల బలం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఓ వారం పాటూ ఇలాంటి వాతావరణమే ఉంటుంది.