Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు బిగ్ షాక్.. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ

Update: 2025-04-23 01:32 GMT
Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు బిగ్ షాక్.. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ
  • whatsapp icon

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు బిగ్ షాక్ తగిలింది. వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు జగన్. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు వచ్చిన ఫిర్యాదుతో వైసీపీ అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైసీపీ ఎక్స్ వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేవి వివాదాలే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేర్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు, అధికారం కోల్పోయిన తర్వాత కుటుంబ వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.

భార్య, పిల్లలకు దూరంగా మరో మహిళతో ఆయన కలిసి ఉంటున్నారు. తన స్నేహితురాలు దివ్వెల మాధురితో ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ తరచుగా జంటగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూల్లో వారి చేష్టలు కాస్త శ్రుతిమించుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.

దువ్వాడ శ్రీనివాస్ తాను వివాదాల్లో చిక్కుకోవడంతోపాటు పార్టీకి తలనొప్పిగా మారారనే ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో వైసీపీ క్రమశిక్షణ కమిటీ ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టింది. క్రమశిక్షణ కమిటీ సిఫార్సులతోపాటు , వైఎస్ జగన్ ఆదేశాలతో పార్టీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. ఈమధ్యే యూజీసీ అనుమతి లేని ఓ ఫేక్ యూనివర్సిటీ నుంచి దువ్వాడ డాక్టరేట్ తీసుకున్నట్లు ఆయన ప్రత్యర్థులు సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేశారు.

ఆ వివాదం ముగిసేలోపే విద్యుత్ అధికారులను బెదిరించారని మరో వార్త వెలుగులోకి రావడంతో వైసీపీ అధిష్టానంతోపాటు ఆయన అనుచరులు కూడా ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. నిత్యం వివాదాలు వెంటాడుతుండటంతో పార్టీ అధిష్టానం దువ్వాడపై చర్యలు తీసుకుంది. కుటుంబ వివాదంతో పార్టీకి భారీగా డ్యామేజీ అవుతుందని భావించిన వైసీపీ ఆయనను టెక్కలి నియోజకవర్గ ఇంచార్జీ బాధ్యతల నుంచి తప్పించింది.

Tags:    

Similar News