Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లా మెట్టవలసలో ఉద్రిక్తత

Andhra Pradesh: టీడీపీ గెలుపుపై వైసీపీ వర్గీయుల తప్పుడు ప్రచారం

Update: 2021-02-23 06:03 GMT

Representational Image

Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం మెట్టవలసలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ పోరు ముగిసినా కక్షసాధింపు చర్యలు పెరగడంతో జిల్లా వసులు ఉలిక్కిపడ్డారు. పంచాయతీ పోరులో గెలిచిన అభ్యర్ధులపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఇరు వర్గాల చేసుకున్న దాడిలో 20 మంది గాయపడ్డారు. బాధితులను రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్తుండగా టీడీపీ వర్గీయులపై వైసీపీ నేతలు కత్తులతో దాడి చేశారని బాధితులు వాపోయారు. మెట్టవలసలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. 

Tags:    

Similar News