గౌతు లచ్చన్న విగ్రహానికి క్షీరాభిషేకం చేసేందుకు సిద్దంఅవుతున్న టిడిపి శ్రేణులు

Update: 2021-01-08 05:42 GMT

శ్రీకాకుళం జిల్లా పలాసలోని సర్దార్‌ గౌతు లచ్చన్న విగ్రహానికి క్షీరాభిషేకం చేసేందుకు ఎట్టకేలకు టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. పది రోజుల కిందట జిల్లాకు చెందిన మంత్రి వ్యాఖ్యలతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. తాజాగా గౌతు లచ్చన్న విగ్రహానికి క్షీరాభిషేకం చేసేందుకు టీడీపీ శ్రేణులు మరోసారి పోలీసుల అనుమతి కోరారు.

అయితే పోలీసులు మొదట నిరాకరించినా తర్వాత అంగీకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవి కుమార్‌ తదితరులు పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు అనుమతి ఇచ్చినా భారీ స్థాయిలో పోలీసు బలగాలు మోహరించడంతో పలాస వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News