సభ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్‌

Update: 2020-12-02 07:32 GMT

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. విద్యుత్‌ సవరణ బిల్లు, అసైన్డ్‌ భూములు లీజు అంశాలపై చర్చ జరపాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే ఈ అంశంపై చర్చించడానికి టీడీపీ అధినేత చంద్రబాబుకి అవకాశం ఇవ్వకపోవడంతో సభ నుంచి టీడీపీ వాకౌట్‌ చేసింది.

మరోవైపు.. ఏపీ వాల్యుయేటెడ్ ట్యాక్స్ థర్డ్ అసైన్‌మెంట్‌ బిల్లును డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రవేశపెట్టారు. అంతకుమునుపు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అలాగే అసైన్డ్‌ల్యాండ్‌ బిల్లును డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌ ప్రవేశపెట్టగా హోంమంత్రి మేకతోటి సుచరిత దిశ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ కీలక బిల్లులపై ప్రస్తుతం శాసనసభలో చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News