Andhra Pradesh: కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల తర్వాత విశాఖ వస్తారు- గంటా
Andhra Pradesh: ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంను మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు కలిశారు.
Andhra Pradesh: ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంను మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు కలిశారు. అరసవిల్లి ఆలయానికి వెళ్లిన ఆయన మర్యాద పూర్వకంగా స్పీకర్‌ను కలిసినట్లు వివరించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరెకిస్తూ తాను చేసిన రాజీనామా గురించి ప్రస్తావించినట్లు గంటా తెలిపారు. రాజీనామాను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తెలిపారన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి చివరి ప్రయత్నంగా రాజీనామాలు చేయాల్సిన సమయం ఆసన్నమయిందన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియగానే మంత్రి కేటీఆర్ విశాఖకు వెళ్లనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. ఇటీవల తెలంగాణ సచివాలయంలో మంత్రి కేటీఆర్‌ను కలిసిన గంటా శ్రీనివాస రావు విశాఖకు రావాల్సిందిగా ఆహ్వానించారు. దాంతో సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సమావేశాలు ముగియగానే విశాఖ వస్తానని హామీ ఇచ్చినట్టు గంటా శ్రీనివాసరావు తెలిపారు.