ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై టీడీపీ ఆందోళనలు
Andhra News: ఇసుక రీచ్‌ల వద్ద టీడీపీ సత్యాగ్రహ దీక్షలపై పోలీసుల ఆంక్షలు
Andhra News: ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై టీడీపీ ఆందోళనలకు దిగింది. ఇసుక రీచ్‌ల వద్ద టీడీపీ సత్యాగ్రహ దీక్షలకు పిలుపునిచ్చింది. అయితే.. టీడీపీ ఆందోళనలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. కోనూరు ఇసుక రీచ్ వద్దకు వెళ్లకుండా శ్రీధర్‌ను గృహ నిర్బంధం చేశారు. అలాగే.. రాజధాని ప్రాంతంలోనూ కొందరు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల ఆంక్షలు దాటుకొని కొల్లూరు మండలంలోని ఇసుక రీచ్‌లకు వెళ్లారు మాజీమంత్రి నక్కా ఆనందబాబు.