TDP-Janasena: కూటమిలో బీజేపీ ఇక చేరనట్లేనా?
TDP-Janasena: బీజేపీ కూటమిలో చేరితే సీట్ల సర్ధుబాటు అంశాన్ని.. పరిశీలిస్తామన్న టీడీపీ అధినేత చంద్రబాబు
TDP-Janasena: టీడీపీ-జనసేన నుంచి ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది. అయినా ఇంకా బీజేపీ కూటమిలో ఉంటుందా? లేదా? అన్నది కన్ఫామ్ కాలేదు. పవన్ చెప్పినట్లుగా బీజేపీ కూటమిలో చేరితే.. సీట్ల సర్ధుబాటు అంశాన్ని పరిశీలిస్తామని చంద్రబాబు ప్రకటించారు. కాని ఫస్ట్ లిస్ట్ వెలువడే వరకు బీజేపీ ఇంకా నిర్ణయాన్ని ప్రకటించలేదంటే కూటమి నుంచి దూరంగా ఉండేందుకే మొగ్గు చూపుతుందని రాజకీయ విశ్లేషకులుంటున్నారు.
ఇప్పటికే పవన్ పలుమార్లు బీజేపీ అధిష్టానంతో ఢిల్లీ కేంద్రంగా చర్చలు జరిపారు. చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు. అయితే ఇన్ని సార్లు పవన్ బీజేపీతో చర్చలు జరిపినా.. చంద్రబాబు డైరెక్ట్‌గా వెళ్లి అమిత్ షాను కలిసినా.. బీజేపీ నుంచి ప్రకటన వెలువడకపోవడం చర్చకు దారితీస్తోంది.
ఆల్ రెడీ లిస్ట్ రిలీజ్ అయింది కాబట్టి.. ఇక కూటమిలో బీజేపీ లేనట్లేనన్న అంచనాలు కూడా వెలువడుతున్నాయి. బీజేపీ కూటమిలో చేరాలనుకుంటే ఇప్పటికే చేరి ఉండేదని.. కూటమిలో చేరేందుకు బీజేపీ సుముఖంగా లేదు కాబట్టే మౌనంగా ఉంటుందన్న రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక బీజేపీ ఇప్పుడు కూటమిలో చేరినా.. ఆల్ రెడీ ప్రకటించిన అభ్యర్థులను చంద్రబాబు-పవన్‌లు మార్చలేరు కాబట్టి.. బీజేపీ కూటమిలో చేరకపోవచ్చన్న ప్రచారానికి బలం చేకూర్చుతుంది.