Taraka Ratna Health Update: మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తారకరత్న
Taraka Ratna Health Update: తారకరత్నను ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరు తరలింపు
Taraka Ratna Health Update: అస్వస్థతకు గురైన నటుడు, టీడీపీ నేత తారకరత్నను మెరుగైన వైద్యం కోసం కుప్పం నుంచి బెంగళూరుకు తరలించారు. శుక్రవారం రాత్రితారకరత్న భార్య అలేఖ్య కుప్పం వచ్చారు. ఆమె నిర్ణయం మేరకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరుకు తరలించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని నందమూరి బాలకృష్ణ దగ్గరుండి పర్యవేక్షించారు. తారకరత్న గుండెలో ఎడమవైపు వాల్వ్ 90 శాతం బ్లాక్ అయిందని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తరలించాలని కుప్పంలోని P.E.S. ఆసుపత్రి వైద్యులు సూచించారు. ఈ మేరకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిని సంప్రదించారు. దీంతో అక్కడి నుంచి అత్యాధునిక సదుపాయాలున్న ప్రత్యేక అంబులెన్స్‌ను కుప్పం రప్పించారు. ఆ అంబులెన్స్‌లోనే ప్రముఖ కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తూ తారకరత్నను బెంగళూరు తరలించారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. యువగళం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పార్టీ శ్రేణులు తారకరత్నను ఆస్పత్రికి తరలించారు. మాసివ్ స్ట్రోక్ రావడంతో కుప్పకూలిపోయారని.. యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేసినట్లు డాక్టర్లు తెలిపారు. శుక్రవారం సాయంత్రం నారా లోకేశ్ తారకరత్నను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.