నేడు చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు

Chandrababu: గవర్నర్ అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేశారని పిటిషన్

Update: 2024-01-16 03:30 GMT

నేడు చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు

Chandrababu: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-A కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా కేసు ఏపీ సీఐడీ అధికారులు నమోదు చేశారంటూ పిటిషన్‌లో తెలిపారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్, క్రిమినల్ ప్రొసీడింగ్స్ రద్దు చేయాలని పిటిషన్‌లో తెలిపారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-Aని ఉదహరిస్తూ తన అరెస్టును సవాల్ చేశారు. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించి అక్టోబరు 17న తీర్పు వాయిదా వేసింది. దీంతో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెల్లడించనుంది. కాగా ఇదే కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Tags:    

Similar News