జనసేనాని 2.O..ఫాస్ట్ రియాక్షన్‌కు కేరాఫ్‌గా పవన్ కల్యాణ్

Update: 2019-10-03 09:47 GMT

మొన్నటి వరకు ఎలాంటి యాక్షన్‌కైనా ఇచ్చే రియాక్షన్‌ కాస్త లేటయ్యేది. కానీ ఇప్పుడు సీన్‌ మారింది. పరిస్థితి ఫాస్ట్‌ రియాక్షన్‌కు కేరాఫ్‌గా మారింది. దెబ్బలు తగిలేకొద్దీ బలపడాతామని చెప్పే జనసేనాని పవన్ కల్యాణ్‌ దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో సమస్య ఏదైనా పవన్ నుంచి స్పందన మాత్రం స్పీడ్ అండ్ స్ట్రాంగ్‌గా వస్తోంది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పీడ్ పెంచారు. గత ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బతో తన రూటు పూర్తిగా మార్చేశారు. ఓ పక్క ప్రజా సమస్యలపై స్పందిస్తూనే మరో పక్క ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను గట్టిగా ప్రశ్నిస్తున్నారు. సమస్య ఎలాంటిదైనా బాదితులు తన దగ్గరకు వచ్చినా, రాకున్నా.. విషయం తన దృష్టికి వస్తే చాలు పవన్ నుంచి స్పాట్‌ రియాక్షన్ వచ్చేస్తుంది. ముఖ్యంగా ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ఆయన చేస్తున్న కామెంట్స్‌ అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.

ఇసుక పాలసీ, అమరావతి నిర్మాణం, రివర్స్ టెండరింగ్ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పవన్‌ తాజాగా రాష్ట్రంలో కరెంటు కోతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ విషయంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొవడంలో విఫలమైందని ఘాటుగా విమర్శించారు. ఇటు తెలంగాణలో కూడా జరుగుతున్న పరిణామాలపై పవన్‌ త్వరితగతిన స్పందించారు. ఇటీవల నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వాలపై విరుచుకుపడ్డాయి. అదే సమయంలో స్పందించిన పవన్‌ యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులకు అండగా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

గత ఐదేళ్ల కాలంలో పవన్ పొలిటికల్ యాక్టివిటీ అంతంతమాత్రంగానే ఉన్నట్లు చెబుతారు. ఎంత పెద్ద సమస్య అయినా పవన్ నుండి స్పందన అంత త్వరగా వచ్చేది కాదంటారు. దీంతో పార్టీ బలోపేతం విషయంలో పవన్ బాగా వెనుకబడ్డారనే విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే అలాంటి ఆరోపణలు మరలా రాకుండా ఇప్పటినుండే జాగ్రత్తలు తీసుకుంటున్న పవన్ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్లమెంట్ నియోజకర్గాల వారిగా సమీక్షలు నిర్వహిస్తూ కేడర్‌ను యాక్టీవ్‌గా ఉంచుతున్నారు. నియోజగకర్గాల వారిగా ఇంచార్జ్ లను నియమించి పార్టీని బలోపేతం దిశగా తీసుకు వెళ్తున్నారు.

Full View 

Tags:    

Similar News