Yuvagalam: రెండో రోజు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

Yuvagalam: కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల సమీపంలో క్యాంప్

Update: 2023-01-28 06:00 GMT

Yuvagalam: రెండో రోజు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

Yuvagalam: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర రెండో రోజు ప్రారంభమయింది. కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల సమీపంలో క్యాంప్ సైట్ ప్రారంభించిన నేటి యాత్ర 9.7 కిలో మీటర్లు కొనసాగునుంది. బెగ్గిలపల్లిలో స్థానికులతో మాటా మంతీలో పాల్గొంటారు. అనంతరం కడపల్లిలో పార్టీ పెద్దల నుంచి ఆశీర్వచనం తీసుకుంటారు. కలమలదొడ్డిలో భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. పార్టీ సీనియర్ నేతలతో సమావేశమవుతారు. కలమలదొడ్డి నుంచి పాదయాత్ర కొనసాగించి శాంతిపురం క్యాంప్ సైట్‌కు చేరుకుంటుంది అక్క ప్రముఖులతో సమావేశమవుతారు. కుప్పంలోని శాంతిపురంలో రాత్రి బస చేయనున్నారు. రెండో రోజు 9.3 కిలోమీటర్లు లోకేశ్పాదయాత్ర చేయనున్నారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రెండో రోజు 9.7 కిలో మీటర్లు నడుస్తారు. తన పాదయాత్రలో అడుగడుగునా ప్రజలతో మమేకమవుతూ, కార్యకర్తలు, స్థానిక ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగుతారు. పలు ప్రాంతాల్లో వివిధ వర్గాల ప్రజలతో లోకేశ్ మాట్లాడి, వారి సమస్యలపై వినతులు స్వీకరిస్తారు. పాదయాత్రకు సిద్ధమైన ఆయన ప్రజ ల కు బ హిరంగ లేఖ రాశారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగిస్తోందని, వైసీపీ బాదుడే బాదుడు పాల న లో బాధితులు కాని వారు లేరన్నారు. పౌరుల ప్రజాస్వామ్య హక్కులను వైసీపీ నేత లు హ రించారని, రాజ్యాంగాన్ని తుంగ లో తొక్కి రాక్షస పాల న సాగిస్తున్నారని, ఏపీలో ప్రశ్నించే ప్రతిప క్షంపై అక్రమ కేసులు, దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

ఏపీకి కొత్త ప‌రిశ్రమ‌లు రావ‌డం లేదని ఉన్న వాటిని త‌రిమేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుల‌, మ‌త‌, ప్రాంతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, పోలీస్‌ వ్యవస్థను జ‌గ‌న్‌రెడ్డి త‌న ఫ్యాక్షన్ రాజకీయాలకు వాడుతున్నారని విమర్శించారు. జగన్‌రెడ్డి తుగ్లక్ నిర్ణయాలతో అన్నివ్యవస్థలను నిర్వీర్యం చేశారని, ఏపీని కాపాడుకోవాల్సిన బాధ్యత మ‌నంద‌రిపైనా ఉందన్నారు. ఏపీని సంక్షోభంలోకి నెట్టేస్తున్న జగన్‌ సర్కార్‌ను గద్దె దింపాల్సిందేనని లోకేశ్ పిలుపిచ్చారు.

Tags:    

Similar News