Tirumala: తిరుమల ఘాట్‌రోడ్డులో ప్రమాదం.. ఇద్దరు వృద్ధులకు తీవ్రగాయాలు
Tirumala: టైర్ పంచర్ కావడంతో మరో కారును ఢీకొట్టిన కారు
Tirumala: తిరుమల ఘాట్‌రోడ్డులో ప్రమాదం జరిగింది. 2వ ఘాట్ రోడ్డులో చివరి మలుపు వద్ద.. కారు రైలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో కారు టైర్ పంచర్ కావడంతో.. రోడ్డుపైకి వచ్చిన మరో కారును ఢీకొట్టిన కారు. విజయవాడకు చెందిన ఇద్దరు వృద్ధులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వృద్ధులను 108 సహాయంతో అశ్విని ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా గుర్తించారు పోలీసులు.