Chittoor: ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి

Chittoor: వరుసగా రెండు లారీలు, కారు, టాటాఏస్‌, బైక్‌ ఢీ

Update: 2023-09-08 07:55 GMT

Chittoor: ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి

Chittoor: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వరుసగా రెండు లారీలు, కారు, టాటాఏస్‌, బైక్‌ ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు మృతి చెందారు. వడమాలపేట చెక్‌పోస్ట్‌ వద్ద ఆగివున్న లారీని మరో లారీ ఢీకొంది. రోడ్డుకు అడ్డంగా పడిన లారీని మరో కారు ఢీకొట్టింది. దీంతో.. కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే.. ప్రమాదానికి గురైన కారును బైక్‌ ఢీకొట్టడంతో.. బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు మృత్యువాత పడ్డారు. తిరుపతి నుంచి తమిళనాడుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Tags:    

Similar News