AP CM Camp Office: క్యాంప్ ఆఫీస్‌లో విజయవాడ నగర అభివృద్ధిపై సమీక్ష
AP CM Camp Office: లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో విజయవాడపై సమీక్షకు ప్రాధాన్యత
AP CM Camp Office: క్యాంప్ ఆఫీస్‌లో విజయవాడ నగర అభివృద్ధిపై సమీక్ష ప్రారంభమైంది. సీఎంవో అధికారులతో జరుగుతున్న ఈ సమీక్షలో మాజీమంత్రి వెళ్లంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దేనినేని అవినాష్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత కొంతకాలంగా విజయవాడ నగర అభివృద్ధిపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య రాజకీయ రగడ రాజుకుంది. మరోవైపు.. లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో విజయవాడపై సమీక్షకు ప్రాధాన్యత సంతరించుకుంది.