Ramchandra Yadav: నాయకుడు అంటే నడిపించే వాడే కాదు.. నడవడానికి ఓ దారి కూడా వేసేవాడు
Ramchandra Yadav: జాబ్ మేళాను యువత ఉపయోగించుకోవాలి
Ramchandra Yadav: నాయకుడు అంటే నడిపించే వాడే కాదు.. నడవడానికి ఓ దారి కూడా వేసేవాడు. అదే కోవకు చెందిన నాయకుడు రామచంద్రయాదవ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగం. ఓ వైపు ఉద్యోగం, మరోవైపు ఉపాధి విషయంలో అర్థంకాక త్రిశంఖు స్వర్గంలో యువత కొట్టుమిట్టాడుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా జాబ్ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు రామచంద్రయాదవ్. 400 పైచిలుకు సంస్థల నుంచి 75 వేల మందికి పైగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. స్కిల్డ్, అన్ స్కిల్డ్ వర్కర్స్ నుంచి మొదలు వర్కింగ్ ప్రొఫెషనల్ వరకు అన్ని రకాల ఉద్యోగాలు యువతకు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఐటిఐ, ఫిట్టర్ నుంచి ఇంజనీర్ల దాకా, సైబర్ సెక్యూరిటీ నుంచి సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ దాకా అన్ని రకాల ఉద్యోగ అవకాశాలను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అన్ స్కిల్డ్ లో హెల్పర్స్ నుంచి కష్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ దాకా 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు వేతనాలు చెల్లించే అన్ని రకాల కంపెనీలను ఒకే వేదికపైకి తెచ్చి నిరుద్యోగులకు తనదైన సహాయం చేస్తున్నారు. యువత కోసం ఉద్యోగ సంబరం పేరుతో సెప్టెంబర్ 2, 3 తేదీల్లో మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్ లో ఈ కార్యక్రమం జరగనుంది. 18 నుండి 35 సంవత్సరాల వయస్సు మధ్యలోని ఎస్ ఎస్ సీ నుండి డిగ్రీ, పిజీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ చదివిన నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని, ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూలకు హజరు కావాలని చెప్పారు. అర్హతలను బట్టి రూ. 13 వేల నుండి రూ. లక్షన్నర వరకూ వేతనం లభించే ఉద్యోగాలు ఈ జాబ్ మేళాలో పొందవచ్చని రామచంద్రయాదవ్ అన్నారు.