Ramatheertham issue: రామతీర్థంలో టెన్షన్‌.. టెన్షన్..

Ramatheertham issue: * రామతీర్థం ధర్మయాత్రకు బీజేపీ, జనసేన పిలుపు * విశాఖ నుంచి బీజేపీ, జనసేన నేతల భారీ ర్యాలీ * ధర్మయాత్రకు పర్మిషన్‌ లేదంటున్న పోలీసులు

Update: 2021-01-05 03:45 GMT

Pawan Kalyan (file image)

Ramatheertham issue: విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం ఘటన రాజకీయ రంగు పులుముకుంటోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ఇప్పటికే రామతీర్థంలో పలువురు రాజకీయ నాయకుల పర్యటన కొంత ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది. అయితే ఇవాళ బీజేపీ-జనసేన సంయుక్తంగా రామతీర్థం ధర్మయాత్రకు పిలుపునిచ్చింది. దీంతో రామతీర్థంలో మరోసారి హై టెన్షన్‌ నెలకొంది.

ధర్మయాత్రలో భాగంగా విశాఖ నుంచి రామతీర్థం(Ramatheertham issue) వరకు బీజేపీ, జనసేన నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. రామతీర్థం ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని బీజేపీ, జనసేన డిమాండ్ చేస్తున్నాయి. ఈ ర్యాలీలో పరాష్ట్ర సహ ఇన్‌చార్జ్‌ సునీల్‌ దేవదర్‌తో పాటు ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ మాధవ్‌, జనసేన నుంచి అసెంబ్లీ మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌తో పాటు పలువురు నేతలు పాల్గొననున్నారు.

మరోవైపు రామతీర్థం(Ramatheertham issue)లో బీజేపీ, జనసేన నేతల పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి దీక్షలకు, ర్యాలీలకు అనుమతిలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. రామతీర్థం ప్రధాన ఆలయంతో పాటు బోడికొండ మెట్ల మార్గం, కొండపైనున్న కోదండరాముని ఆలయం, కొండకు వెళ్లే ముఖద్వారం, కొండ వెనుక భాగంలో పోలీసులు భారీగా మోహరించారు. అర్చకులు మినహా, ఎవ్వరూ బోడి కొండపైకి వెళ్ళకుండా బారికేడ్లు, కంచెలు ఏర్పాటు చేశారు. రామతీర్థంలో 144 సెక్షన్‌, 30 యాక్ట్‌ అమలు చేశారు.

బీజేపీ, జనసేన రామతీర్థం(Ramatheertham issue) ధర్మయాత్రతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రామతీర్థం వెళ్లేందుకు బయల్దేరుతున్న బీజేపీ, జనసేన నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుని హౌస్‌ అరెస్ట్ చేస్తున్నారు. గాజువాకలో పలువురు బీజేపీ నాయకులను గృహ నిర్బంధం చేశారు. జనసేన నేతలను కూడా అడ్డుకుని వెనక్కి పంపారు పోలీసులు. రామతీర్థం వెళ్లకుండా బీజేపీ, జనసేన నాయకుల ఇంటిముందు అర్ధరాత్రి నుంచి పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. దీంతో బీజేపీ-జనసేన రామతీర్థం ధర్మయాత్రపై ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటికే మంత్రులు బొత్స, వెల్లంపల్లి రామతీర్థం సందర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కానీ.. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఘటనలకు బాధ్యత వహిస్తూ వెల్లంపల్లి తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ, బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎంపీ విజయసాయిరెడ్డి రామతీర్థం పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆలయాన్ని సందర్శించి కొండ దిగిన విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై అక్కడున్న ఆందోళనకారులు దాడి చేశారు. మరోవైపు రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించారు సీఎం జగన్.

Tags:    

Similar News