Weather Update: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్..వచ్చే మూడు రోజులు వానలే వానలు
Rains Upadate:తెలుగు రాష్ట్రాలకు మరోసారి అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రానున్న మూడు రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కొన్ని జిల్లాల్లో కుండపోత వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది.
Rains Updates In Telugu States: తెలుగు రాష్ట్రాలకు మరోసారి హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న మూడు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని...దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం పేర్కొంది.
పార్వతీపురం మన్యం జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలోని పలు చోట్ల మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లా, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షం పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.
ఆగస్టు 29వ తేదీ నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం కారణంగా రానున్న మూడు రోజులపాటు ఏపీలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర కోస్తాలోని కొన్ని జిల్లాల్లో మంగళవారం, బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇక ఇటు తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ తెలిపింది.