Palnadu: డ్రగ్ అధికారుల దాడులు.. 70 రకాల ఔషధాలతో పాటు రూ.6 లక్షలు విలువైన మందులు సీజ్
Palnadu: ఓ మెడికల్ షాప్‌లో పనిచేస్తున్న వ్యక్తి అక్రమాలకు పాల్పడినట్టు గుర్తింపు
Palnadu: పల్నాడు జిల్లా నరసరావుపేటలో డ్రగ్స్ అధికారులు దాడులు నిర్వహించారు. లైసెన్స్ లేకుండా పెద్ద మొత్తంలో ఔషధాలు సప్లయ్ చేస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టారు. 70 రకాల ఔషధాలతో పాటు 6 లక్షలు విలువచేసే మందులు సీజ్ చేశారు. ఓ మెడికల్ షాప్‌లో పనిచేస్తున్న వ్యక్తి.. ఈ అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలిపేందుకు ఉమ్మడి గుంటూరు అసిస్టెంట్ డైరెక్టర్ నిరాకరించారన్న ఆరోపణలు ఉన్నాయి.